విద్యార్థి దశ నుండే పంటల పై అవగహాన ఉండాలి.:-జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల.
బయ్యారం:చార్మినార్ ఎక్స్ ప్రెస్.
బయ్యారం మండలంలో నామాలపాడు ఈఎంఆర్ఎస్ స్కూల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల ,కెవికె సైంటిస్ట్ క్రాంతి కుమార్ , మండల వ్యవసాయ అధికారి బానోతు రాంజీ ,ఈఎంఆర్ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ అశోక్ ఆధ్వర్యంలో ఏడవ తరగతి విద్యార్థి విద్యార్థులకు శుక్రవారం మొక్కలకు కావలసిన పోషకాలు ఇతర అంశాలపై అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మట్టి నమూనాల సేకరణ మరియు మట్టి పరీక్ష గురించి వాటి ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు చైతన్య పరచడం జరిగినది. విద్యార్థులందరూ రైతు బిడ్డలే కాబట్టి విద్యార్థులకు ఈ విషయం మీద చైతన్యపరిస్తే వారు తమకు తాము ఇంట్లో తమ తల్లిదండ్రులకు అవగహాన చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కెవికె మల్యాల సైంటిస్ట్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రతి రైతు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తమ పొలంలో జిగ్జాగ్ పద్ధతిలో ఆఫ్ కిలో మట్టి వచ్చేవరకు మట్టి నమూనాలు సేకరించి మల్యాల ల్యాబ్ కు పంపించాలని చెప్పడం జరిగినది .మట్టి పరీక్ష చేయించుకోవడం వలన మట్టిలో ఎంత శాతం లో పోషకాలు,లభ్యమవుతున్నాయి .ఎంత మోతాదులో ఎరువులు వేయాలో ఎరువుల సూచిక ఉంటది .కాబట్టి దీని ద్వారా కూడా ఖర్చులు తగ్గించవచ్చు,అని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.