ఉచిత బస్సు పాస్ ల పంపిణీ

టీజీఎస్ఆర్టీసి మంథని డిపో మేనేజర్  శ్రావన్ కుమార్  చేతుల మీదుగా 12 సంవత్సరాల లోపు మగ పిల్లల కు ఎంపియుపిఎస్ రత్నాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు బుర్రి శ్యామ్ మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పాఠశాలలోని 29మంది విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ 12 సంవత్సరాల లోపు మగ పిల్లల కు కేవలం కేవలం 50/-రూపాయల తో 20 కిలోమీటర్ల దూరం వరకు, ఈ బస్ పాస్ ఈ విద్యా సంవత్సరం పూర్తి అయ్యే వరకు పనిచేస్తుంది అని, ఇట్టి అవకాశం ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్  ఎంజెల్, వీబిఓ చంద్ర మౌళి మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment