ఏ.ఎల్.పి గనిని సందర్శించిన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రెటరీ

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రెటరీ  దర్శన్ కుమార్ సోలంకి మంగళవారం అడ్రియాల లాంగ్ వాల్ గనిని సందర్శించారు.ఈ సందర్భంగా అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్  కొప్పుల వెంకటేశ్వర్లు వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. తదుపరి అడ్రియాల లాంగ్ వాల్ గని యొక్క బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను తెలియజేసి, గనిలో వినియోగిస్తున్న యంత్రాలు, భద్రత పరంగా తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం గని లోనికి వెళ్లి లాంగ్ వాల్ పని ప్రదేశాలను సందర్శించి పరిశీలించారు.వారితోపాటు ప్రాజెక్ట్ అధికారి కె.నాగేశ్వరరావు, ఎస్వోటు జి ఎం ఆర్.జి-1 రామ్మోహన్, అధికారులు టి.రఘురాం, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment