తెలంగాణ సాంస్కృతిక కళామండలి సారధి డాక్టర్ వెన్నెలను కమాన్ పూర్ మండల నాసిక్ వెంకన్న బృందం కళాకారులు రంగా సన్మానించారు. ప్రజా నౌక గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెల కు ఇటీవల తెలంగాణ సాంస్కృతిక కళామండలి చైర్మన్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని అప్పగించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వెన్నెల ఓడిపోయారు. దీంతో ఆమెను కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసి ఆమెకు సాంస్కృతిక కళామండలి చైర్మన్ పదవిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో నల్లూరి రామ్మూర్తి, దాసరి రామస్వామి, రవి వర్మ, రొంతల శ్యామ్, రాజు ,భూపెల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెలను సన్మానించిన కళాకారులు
Published On: November 26, 2024 12:58 pm