స్థానిక సమస్యలపై సిపిఎం అధ్వర్యంలో జిపి కార్యాలయం ముట్టడి. -ముల్కనూరు గ్రామంలో సిపిఎం భారీ ప్రదర్శన.

స్థానిక సమస్యలపై సిపిఎం అధ్వర్యంలో జిపి కార్యాలయం ముట్టడి.

-ముల్కనూరు గ్రామంలో సిపిఎం భారీ ప్రదర్శన.

గార్ల(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

గార్ల మండలంలోని ముల్కనూరు పంచాయితీలోని బుడగ జంగాల కాలనీ లో నెలకొన్న స్దానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.ముల్కనూరు, జంగాల పల్లి కాలనీ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపియం అధ్వర్యంలో బుధవారం స్దానిక పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ వార శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామం మధ్యలో డంపింగ్ యార్డ్ పెట్టడం వలన చెత్త దుర్గంధం వ్యాపిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలబుచ్చారు.గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణం చేపట్టినప్పటికీ శవాలను కాల్చడానికి మాత్రమే అవకాశం ఉందని, శవాలను పూడ్చేందుకు అవకాశం లేకపోవడంతో వలన పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రామంలో దోమల మందు పిచికారి చేయకపోవడం వలన దోమలు స్థైర్య విహారం చేస్తుండటం తో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని అందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో సిసి రోడ్లు నిర్మించాలని, డ్రెయినేజీ లలో పూడికతీత పనులు చేపట్టి, శానిటేషన్ పనులు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్‌ లతో కూడిన వినతి పత్రాన్ని పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కు అందించారు.ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కమిటీ సభ్యులు వి.పి.వెంకటేశ్వర్లు,సాయిరాం,మారయ్య,కోటమ్మ, కేటీఆర్, సమ్మయ్య, వీరన్న, రాములు, రాంబాబు, కొండయ్య, వెంకటేష్,రవీందర్, సిహెచ్. కొండయ్య తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment