అధికారులకు క్వార్టర్స్ కేటాయింపు కొరకు కౌన్సిలింగ్

రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్  నరేంద్ర సుధాకరరావు ఆదేశాల మేరకు రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు సెంటినరీ కాలనీలో గల నివాస గృహాల(క్వార్టర్స్) కేటాయింపు కొరకు సోమవారం జి.ఎం. కార్యాలయంలో నివాస గృహాల కేటాయింపు కొరకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి 29 మంది అధికారులు  దరఖాస్తు చేసుకోగా, 28 మంది హాజరయ్యారు. వీరిలో అర్హత, సీనియారిటీ ప్రకారం 19 మంది క్వార్టర్స్ ఎంపిక చేసుకున్నారు. వారికి త్వరలోనే కేటాయింపు పత్రాలు అందజేస్తామని ఇంచార్జ్ ఎస్వోటుజిఎం, ఓ.సి.-1 ప్రాజెక్ట్ అధికారి  ఎన్.రాధాకృష్ణ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, డి.వై.పి.ఎం. గుర్రం శ్రీహరి, క్వార్టర్స్ విభాగం క్లర్క్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment