ఆర్జీ-3 పరిధిలోని ఐ ఎన్ టి యు సి ఆఫీసులో ఆర్జీ3 ఇంచార్జి ఉడుత శంకర్ యాదవ్, మహిళా ఇన్చార్జ్ శ్రీమతి రెడ్డి,జిల్లా జనరల్ సెక్రెటరీ బండ కిరణ్ రెడ్డి, బ్రాంచ్ సెక్రెటరీ మల్లూరి మల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.సింగరేణిలో గత ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను మోసం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. జీతభత్యాలు కూడా కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ రానున్న నాలుగైదు నెలల్లో జీతాలు పెంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీని గమనించిన ఇతర యూనియన్ల పార్టీలు మా ఉనికి ఏడ పోతుంది ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ జీతాలు పెంచుతారని అని తెలుసుకొని ఉనికి కోసమే కాంట్రాక్ట్ కార్మికులను నిరసన కార్యక్రమాన్ని తీసుకెళ్లడం చేస్తున్నారు ఎలాగైనా జీతాలు పెరుగుతాయి అని తెలిసి కాంట్రాక్టు కార్మికులను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు.ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం జీతం రానున్న ఐదు నెలల్లో పెరుగుతాయని కార్మికులకు కచ్చితంగా తెలియజేస్తున్నాం.అలాగే కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఐ ఎన్ టి యు సి యూనియన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంట్రాక్టు కార్మికులు మాత్రం నేటి వరకు 70% శాతం మంది ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉంటామని ఐ ఎన్ టి యు సి లో ఏ పనైనా అవుతాయని కార్మికులు జాయిన్ అవ్వడం జరిగింది.ఆర్జీ-3 పరిధిలోని ఐ ఎఫ్ టీ యు సంబంధించిన నాయకులు నేను జీతాలు పెంచుతానని కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ కార్మికులను మోసం చేస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఎల్పి ఫిట్ సెక్రటరీ పంచాల కృష్ణమూర్తి, ఓసి2 సెక్రెటరీ రథం రాజేశం, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ పులి శ్రీనివాస్, ఓసి1 ఇంచార్జ్ దాసరి శ్రీకాంత్, దుర్గం శంకర్, బానేష్, నవీన్, సతీష్, గొర్రె మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు ఐఎన్టీయూసీ తోనే లాభం
Published On: December 22, 2024 4:03 pm