రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పని చేసి శనివారం పదవీ విరమణ పొందిన అల్లం లూర్ధు మేరీని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత దాసరి శివ మాట్లాడుతూ మేరి మేడం పదవి విరమణ బాధాకరమని ఎంతో సహనంతో ఓర్పుతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ప్రధానోపాధ్యాయురాలిగా పాఠశాలను క్రమశిక్షణతో నడిపించారన్నారు.కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కల్వల శంకర్ నాయకులు ఇల్లందుల సంజీవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.