సర్వే మజ్దూర్, డంప్ మెన్-ట్రిప్ మెన్, ఆఫీస్ అటెండెంట్ ఖాళీల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహణ

సింగరేణి రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో ఖాళీగా ఉన్న 2-సర్వే మజ్దూర్, 4-డంప్ మెన్-ట్రిప్ మెన్, 4-ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం శుక్రవారం నాడు సెక్యూరిటీ విభాగం రీడింగ్ హాలులో అంతర్గత అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహించడం జరిగినది. ఈ భర్తీలో భాగంగా సర్వే మజ్దూర్ పోస్టుల కొరకు 13 మంది , డంప్ మెన్-ట్రిప్ మెన్ పోస్టుల కొరకు 6 మంది, ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కొరకు ఒక్కరు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మొత్తం 18 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనారు. పరీక్షల నిర్వహణను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, పర్యవేక్షించారు. ఈ పరీక్షల ఫలితాలను బుధవారం సాయంత్రం ప్రకటించి, జి.యం. కార్యాలయం నందు గల నోటీసు బోర్డులో అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు . నిర్వహణలో  పరీక్షల కన్వీనర్, ఎస్వోటుజియం జి.రఘుపతి, ఓ.సి.-1 ప్రాజెక్ట్ ఆఫీసర్ జె.రాజశేఖర్, డి.జి.యం. కె.చంద్రశేఖర్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, సర్వే విభాగాధిపతి డి.జనార్దన్ రెడ్డి, డి.పి.ఎం. గుర్రం శ్రీహరి, సీనియర్ పర్సనల్ అధికారులు మతీన్ హుస్సేన్, రాజేశం, పర్సనల్, సెక్యూరిటీ విభాగాల సిబ్బంది, పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version