సింగరేణి రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో ఖాళీగా ఉన్న 2-సర్వే మజ్దూర్, 4-డంప్ మెన్-ట్రిప్ మెన్, 4-ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం శుక్రవారం నాడు సెక్యూరిటీ విభాగం రీడింగ్ హాలులో అంతర్గత అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహించడం జరిగినది. ఈ భర్తీలో భాగంగా సర్వే మజ్దూర్ పోస్టుల కొరకు 13 మంది , డంప్ మెన్-ట్రిప్ మెన్ పోస్టుల కొరకు 6 మంది, ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కొరకు ఒక్కరు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మొత్తం 18 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనారు. పరీక్షల నిర్వహణను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, పర్యవేక్షించారు. ఈ పరీక్షల ఫలితాలను బుధవారం సాయంత్రం ప్రకటించి, జి.యం. కార్యాలయం నందు గల నోటీసు బోర్డులో అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు . నిర్వహణలో పరీక్షల కన్వీనర్, ఎస్వోటుజియం జి.రఘుపతి, ఓ.సి.-1 ప్రాజెక్ట్ ఆఫీసర్ జె.రాజశేఖర్, డి.జి.యం. కె.చంద్రశేఖర్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, సర్వే విభాగాధిపతి డి.జనార్దన్ రెడ్డి, డి.పి.ఎం. గుర్రం శ్రీహరి, సీనియర్ పర్సనల్ అధికారులు మతీన్ హుస్సేన్, రాజేశం, పర్సనల్, సెక్యూరిటీ విభాగాల సిబ్బంది, పాల్గొన్నారు.