కామ్రేడ్ మావో 48వ వర్ధంతి.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
మార్క్సిస్టు మహోపాధ్యాయులు కామ్రేడ్ మావో 48వ వర్ధంతి సందర్భంగా బయ్యారం మండల కేంద్రం పార్టీ కార్యాలయంలో నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మైదాన మండల కార్యదర్శి ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ చైనాలో ఫ్యూడల్ స్వాముల ఆధీనంలో చిన్న చిన్న భాగాలుగా ఉన్న ప్రాంతాలను కామ్రేడ్ మావో నాయకత్వంలో ఎర్రసైన్యం తో లాంగ్ మార్చ్ ప్రాంతాలను ఐక్యం చేసి 1949 లో చైనాలో విప్లవాన్ని విజయవంతం చేశాడు.1949 చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ( పి ఆర్ సి ) స్థాపనకు విశాలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు. ఆయన చనిపోయేంతవరకు ఆధునిక ప్రపంచ చరిత్రలో సైనిక ,పారిశ్రామిక ,వ్యవసాయం, సంస్కృతికంగా అనేక మార్పులతో నవ చైనా ను ముందుకు తీసుకుపోయాడని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు తుడుం వీరభద్రం, నేతకాని రాకేష్ , గుండెబోయిన లింగమల్లు , మింగు భగవాన్, పొన్నం రమేష్ ,శేషు ,హనుమా తదితరులు పాల్గొన్నారు.