ఉమ్మడి నల్లగొండ జిల్లా చెస్ సెలక్షన్స్

 ఉమ్మడి నల్లగొండ జిల్లా చెస్ సెలక్షన్స్ సెప్టెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి, గండూరి కృపాకర్, ఎల్ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ సెలక్షన్ పోటీలు అండర్ 9, 11, 15 బాల, బాలికలకు స్థానిక (టి. టి. డి )కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పోటీలలో సెలక్షన్ అయిన వారిని హైదరాబాదులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా చదరంగం క్రీడాకారులు ఉపయోగించుకోవాలని వారు కోరారు. వివరాలకు ఎల్ సతీష్ కుమార్ కార్యదర్శి, చరవాణి నెం. 9394753343 సంప్రదించాలని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment