- రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో పీ ఎం విశ్వకర్మ యోజన దరఖాస్తులకు సోమవారం క్లియరెన్స్ లభించింది. 37 మంది విశ్వబ్రాహ్మణులు, ఇతర కులాల వారు ఈ పథకంకు దరఖాస్తు చేసుకున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి దీర్ఘకాలిక సెలవులో ఉండడంతో ఆన్లైన్ లో థంబ్ పడక క్లియరెన్స్ లభించలేదు. నూతనంగా విధులలో చేరిన కార్యదర్శి గంగుల సంతోష్ ఆన్లైన్ లో థంబ్ ఒకే కావడంతో దరఖాస్తులకు క్లియరెన్స్ లభించింది. గతంలో పలు పత్రికలలో విశ్వకర్మ కులస్తుల ఇబ్బందుల గురించి వార్తా కథనాలు ప్రచురించి,సమస్య పరిష్కరించిన అధికారులకు, పాత్రికేయులకు మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు కృతజ్ఞతలు తెలిపారు.
పీఎం విశ్వకర్మ యోజన దరఖాస్తులకు క్లియరెన్స్
Published On: August 5, 2024 9:05 pm