ఫ్యామిలీ గ్రూప్ ఇన్ రైతు భరోసా ప్రత్యేక యాప్ తనిఖీ..

ఫ్యామిలీ గ్రూప్ ఇన్ రైతు భరోసా ప్రత్యేక యాప్ తనిఖీ..

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

బయ్యారం మండలంలో ఫ్యామిలీ గ్రూప్ ఇన్ రైతు భరోసా ప్రత్యేక యాప్ లో ఫోటో దిగే కార్యక్రమాన్ని తనిఖీ లో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, మహబూబాద్ డివిజన్ ఏడీఏ శ్రీనివాసరావు,జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్  మరియన్న పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విజయనిర్మల  రుణమాఫీ కానీ రైతులతో మాట్లాడడం జరిగినది. రెండు లక్షల రుణమాఫీ కానీ వారు,రేషన్ కార్డు లేని రైతులతో ముఖాముఖి మాట్లాడడం జరిగినది.రెండు లక్షల మాఫీ కానీ రైతులు ఏవో లాగిన్ లో ఉన్న రైతుల జాబితాలో పేర్లు ఉన్న వారికి సమాచారం ఒక రోజు ముందుగా ఫోన్ ద్వారా గాని లేదా ఏఈఓ ద్వారా సమాచారం ఇప్పించి ప్రత్యేక యాప్ లో ఫోటో దింపడం జరుగుతుందని చెప్పారు.జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ మరియన్నా ,ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవాలని రైతులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి బానోతు రాంజీ, ఏవో తేజస్వి ,రచన, నాగరాజు పాల్గొనడం జరిగినది.

Join WhatsApp

Join Now

Leave a Comment