రామగిరి మండలం శివరాం నగర్ లోని ఉప్పర్ల కేశారం అంగన్వాడి పాఠశాలలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు జరిగాయి. తల్లులకు తల్లిపాలు, ముర్రుపాల ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. కేవలం తల్లి పాలు ఆరు నెలల వరకు ఇవ్వాలని, అనుబంధ ఆహారం ఇస్తూ తల్లిపాలను రెండు సంవత్సరముల వరకు కొనసాగించాలని వివరించడం జరిగింది. పిల్లల పెరుగుదలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పల్లె.అనిత అంగన్ వాడి టీచర్ ఎం.స్వరూప,ఆశా వర్కర్ సుమలత, గర్భిణీలు ,బాలింతలు తల్లులు ,కిశోర బాలికలు పాల్గొన్నారు.
అంగన్వాడీలో తల్లిపాల వారోత్సవాలు
Published On: August 2, 2024 4:47 pm