మెడికల్ కాలేజీకి శరీర దానం

 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 8వ కాలనీకి చెందిన దాసారపు మోహన్(59) అనే మాజీ సింగరేణి కార్మికుడు, అనారోగ్య కారణాలతో  మృతి చెందాడు. భర్తను కోల్పోయిన విషాదంలో ఉన్న సింగరేణి డిస్పెన్సరిలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న మృతుని భార్య ఏవీ.రమణ, కూతురు, అల్లుడు డాక్టర్ వినీషా – అవినాష్, కూతురు అశ్విని సమాజహితం కోసం స్ఫూర్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించడానికి సదాశయ ఫౌండేషన్, కమాన్ పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం మృతుని నేత్రాలను ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ సహకారంతో సేకరించి, నేత్రాలను హైదరాబాద్ కు తరలించారు. అలాగే వైద్య విద్య పరిశోధనకు దోహదపడాలని మెహన్ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, రామగుండం సిమ్స్ మెడికల్ కాలేజీలోని అనాటమీ డిపార్ట్మెంట్ కు దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి సిహెచ్.లింగమూర్తి, కమాన్ పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… మృతుని నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు, ఇద్దరికి చూపునిచ్చి ఆయన చూపును సజీవంగా ఉంచారని, అలాగే వైద్య విద్యార్థుల పరిశోధనకు దోహదపడేలా మెడికల్ కాలేజీకి శరీరాన్ని దానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన విషాదంలో కూడా కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయమన్నారు. పార్థివ దేహాన్ని స్వీకరించిన అనాటమీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కల్పన, టెక్నీషియన్లు లక్ష్మణ్ కుమార్, సిద్ధార్థ, తిరుపతితోపాటు కాలేజీ సిబ్బంది, కుటుంబ సభ్యులు, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిదులు గౌరవ వందనం చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు, యోగేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వెళ్ది కవిత అనంతరములు, పట్టణ కార్యదర్శి బోల్ల చంద్రశేఖర్, లయన్స్ క్లబ్ కార్యదర్శి నల్లవెల్లి శంకర్, మృతుని బంధువులు అవినాష్, శ్రీనివాసులు, ద్వరకనాథ్, కోటేశ్, మున్నా, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. నేత్రాదానం, దేహాదానం చేసిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రవణ్ కుమార్, ముఖ్య సలహాదారులు నూక రమేష్, కార్యదర్శి మేర్గు భిష్మాచారి, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి.మల్లికార్జున్ తదితరులు అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment