శ్రీరామ్ నగర్ విజయాంజనేయ స్వామి ఆలయంలో 12 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

  • జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీ విజయాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో 12 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరింగంటి వరదాచార్యులు హనుమాన్ విగ్రహ దాత రంగినేని ఉపేందర్ రావు లక్ష్మి దంపతులతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 12 అడుగుల హనుమాన్ విగ్రహం భూమి పూజ కార్యక్రమాన్ని తిలకించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ విజయాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సహకారంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించుకుంటున్నామని ఇందుకు సహకరించిన దాతలకు ఈ సందర్భంగా స్వామివారి మంగళాశాసనం తెలియజేశారు.ఆలయ అధ్యక్షుడు మండల్ రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయం నిరంతరాయంగా సాగాలన్న అన్ని విశేష కార్యక్రమాలు వైభవపేతంగా జరగాలన్న భక్తుల సహాయ సహకారాలు ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.ప్రతినెల దేవాలయాల్లో గోత్రనామార్చన చేయించుకుంటున్న భక్తులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.మున్ముందు జరిగే విశేష కార్యక్రమాల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆర్థిక సహకారంతోపాటు సేవా దృక్పథంతో ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి నాగవల్లి దశరథ కోశాధికారి ఎల్లమద్ది అశోక్ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కట్టెకోల పూర్ణచందర్రావు మరియు భక్తులు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment