- బయ్యారంలో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
బయ్యారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బయ్యారం మండల అధ్యక్షులు రాసాల నరేష్ యాదవ్ అధ్యక్షతన బయ్యారం మండల బిజెపి పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి మానుకోట జిల్లా మాజీ అధ్యక్షులు,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీతయ్య హాజరయ్యారు.
ఈ సమావేశంలో భవిష్యత్తులో పార్టీ వ్యూహాలు, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ కోసం కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.ఈ సమావేశంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.సమావేశం అనంతరం బయ్యారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐ తిరుపతి ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.