మానుకోట బిఆర్ఎస్ మహాధర్నా కు భారీగా తరలిన బయ్యారం బిఆర్ఎస్ కార్యకర్తలు.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ మానుకోట జిల్లా కేంద్రంలోని స్థానిక తహశీల్దారు కార్యాలయంలో ఎదుట ధర్నా కు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు.ఈ మహా ధర్నా లో కేటిఆర్ మాట్లాడుతూ లగుచర్ల ఘటనలో జైల్లో ఉన్న గిరిజనులను వెంటనే విడుదల చేయాలని వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నా ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పాలకులు అడ్డుతగులడం సిగ్గుమాలిన చర్య అన్నారు.
మానుకోట గిరిజన జాతి తరపున మహా ధర్నా కు మద్దతు గా బయ్యారం గ్రామపంచాయతీ నుండి బిఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నీలారపు సంపత్ యాదవ్, కీర్తి ఉదయ్, రేఖ యాకయ్య, పోతుగంటి గణేష్,యరసంగి పాపయ్య, పోతుగంటి బ్రహ్మచారి,నల్లబోతు వినయ్,బయ్యారం మండల యూత్ కార్యకర్తలు,బయ్యారం టౌన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.