పెళ్లి కూతురును ఆశీర్వదించిన బడుగుల
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సూర్యాపేట ప్రతినిధి నవంబర్: 27
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు జక్కలి గోపి సోదరి అశ్విని పెళ్లి కూతురు వేడుకకు మాజీ ఎంపీ, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ హాజరై వధువును ఆశీర్వదించారు. ఆశీర్వదించిన వారిలో మాజీ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, మాజీ జడ్పీటీసీ జీడి బిక్షం, రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, బండారు రాజా తదితరులు ఉన్నారు.