జాతీయ అవయవ దాన దినోత్సవం పురస్కరించుకొని సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ చెరుకు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అవయవాలు లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని మరణాంతరం అవయవాలు దానం చేయడం వల్ల పునర్జన్మణి ఇచ్చిన వారం అవుతాము అని అన్నాడు.దీనిపై అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. సింగరేణి సంస్థ ఎస్ఎంఎస్ ప్లాంట్ అధికారిసదాశయ ఫౌండేషన్ సలహాదారు నూక రమేష్ నేత్ర దానం పై అవగాహన కల్పించారు. ఒకరి కళ్ళతో మరొక ఇద్దరికి చూపు ఇవ్వవచ్చని అన్నారు.అనంతరం కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల అవయవాదాన్ని చేసేందుకు ముందటికి రాగా వీరికి డోనర్ కార్డులు అందజేశారు.ఈ కార్యక్రమంలో 8వ కాలనీ పట్టణ అధ్యక్షులు అనంత రాములు సభ్యులు ముత్యాల బాలయ్య ఉద్యోగులు పాల్గొన్నారు.
అవయవ దానం పై అవగాహన సదస్సు
Published On: August 3, 2024 6:32 pm