అంగన్వాడి కేంద్రం మనుగడలో ఉన్నట్టా…లేనట్టా..?

అంగన్వాడి కేంద్రం మనుగడలో ఉన్నట్టా…లేనట్టా..?

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

బయ్యారం మండల కేంద్రంలోని ఓ అంగన్వాడీ కేంద్రం మనుగడలో లేకపోవటంతో ఆ కేంద్రం కు వచ్చే పిల్లలు నానావస్థలు పడుతూ కొంత మంది పిల్లలు ముస్తఫా నగర్ లోని అంగన్వాడీ కి,మరి కొంతమంది పిల్లలు ఎస్సీ కాలనీలోని అంగన్వాడీ కి,మిగిలిన పిల్లలు రంగాపురం బొడ్రాయి సమీపంలో గల అంగన్వాడీ కి పంపించాల్సిన దుస్తితి.వివరాల్లోకి వెళితే మండల కేంద్రం పి ఎమ్ ఎచ్ బాయ్స్ హాస్టల్ పక్కన,మండల పరిషత్ పాఠశాల ఆవరణలో గల అంగన్వాడీ కేంద్రంలో టీచర్ గా పనిచేస్తున్న పొడుగు కౌసల్య విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో 2021 లో మృత్యువాత పడటం,అంతకు ముందే అయాగా గా పనిచేస్తున్న షేక్ మొగిలమ్మ అనారోగ్యంతో 2017 లో మృతి చెందటం తో అక్కడి అంగన్వాడీ కేంద్రం తాత్కాలికంగా మూతపడటంతో కొంత మంది పిల్లలు ముస్తఫా నగర్ లోని అంగన్వాడీ కి,మరి కొంతమంది పిల్లలు ఎస్సీ కాలనీలోని అంగన్వాడీ కి,మిగిన పిల్లలు రంగాపురం బొడ్రాయి సమీపంలో గల అంగన్వాడీ కి పంపించాల్సిన దుస్తితి.టీచర్ ఆయా మరణంతో మూతపడ్డ అంగన్వాడీ 

పరిసర ప్రాంత పిల్లలకు,గర్భిణులకు అంగన్వాడీ కేంద్రం లేకుండా పోయిందని అక్కడి స్థానికులు ఎన్ని మార్లు తమ గోడును వెలిబుచ్చినా సంభందిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు గా పట్టించుకోవడంలేదని ఇకనైనా అంగన్వాడీ కేంద్రాలను శాశ్వత టీచర్,ఆయా వచ్చేవరకు తాత్కాలిక టీచర్ ని ఏర్పాటు చేయాలని స్థానికులు పై అధికారులను వేడుకుంటున్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment