భారీ వరదలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఏఓ,ఏడి.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
బయ్యారం మండలంలోని గత మూడు రోజుల క్రితం వచ్చిన భారీ వర్షానికి పంట పొలాలు నీటి మునగడంతో వాటిని పరిశీలించేందుకు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి రాంజీ పంటలను పరిశీలించినట్లు తెలిపారు. బుధవారం ఉప్పలపాడు,బాలాజీ పేట గౌరారం,వెంకట్రాంపురం,పంచాయతీ పరిధిలోని నష్టపోయిన పంటలను పరిశీలించారు.వీరి వెంట మండల ఇంచార్జ్ ఎంపీడీవో దైవదినం పలు గ్రామాలలో వర్షానికి కూలిపోయిన ఇండ్లను పరిశీలించి వారి పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో నష్టపోయిన పంట పొలాలు ఇండ్లు వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు.