గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి.
పేట మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్
చార్మినార్ ఎక్స్ ప్రెస్; సెప్టెంబర్ 14 ,పెద్ద శంకరంపేట్.
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మాజీ వైస్ ఎంపీపీ కన్నయ్య గారి లక్ష్మీ రమేష్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వినాయకుని అనుగ్రహంతో ప్రజలందరూ పాడిపంటలతో సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.