ప్రస్తుత సమాజంలో మానవ
జాతి మనుగడ అంతరించి పోతుందేమోనాని సందేహంగా భయమేస్తుంది .అవును నిజమే
సామాన్య ప్రజానీకాన్ని మట్టిన కలిపే దిశగా ఈ నకిలి వ్యవస్థ జోరుగ సాగుతూ నడుస్తుంది.
నకిలీ అంతా నకిలీ…!
ఈ కల్తీ వ్యవస్థలో నకిలీ అనే రాజు ,రాజ్యంలో తిష్ట వేసి కూర్చొని, రాజ్యాన్ని కబ్జా చేసుకొని, రాజును నేనే రా రాజు నేనె అంటు. ఈ కల్తీ వ్యవస్థను ఏలుతూ, తొడలే కొడుతున్నాడు. నకిలీ రాజు
నకిలీ అంతా నకిలీ….!
ఈరోజు మార్కెట్లో ప్రతిదీ నకిలీ
అసలుకి నకిలీకి తేడా
తెలుసుకోలేక,పోల్చుకోలేక
సామాన్య ప్రజానీకం ఈ కల్తీ వ్యవస్థలోఎన్నో అవస్థలు
పడుకుంటూ,ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడుతూ, ప్రాణల అరచేతిలో పెట్టుకొని
బ్రతుకుబండినినడిపిస్తున్నారు
నకిలీ అంతా నకిలీ…!
రోజువారి దినచర్యలో భాగంగా
మనిషి జీవించడానికి తీసుకునే ఆహారం మొదలు మార్కెట్లో ప్రతీది నకిలీయే అందుబాటులో ఉంటుంది..
పాలు పాల
ఉత్పత్తులు నకిలీ
నవదాన్యాలు
చిరుధాన్యాలు నకిలి
కూరగాయలు
ఊరగాయలు నకిలీ
పసుపు, కారం నోరూరించే
మసాలాలు వంటనూనె నకిలీ
ఆరోగ్యం కోసం
తిందామంటే పండ్లు నకిలీ
జబ్బు చేస్తే, నయంకోసం
వాడే మందుల్లో నకిలీ
సహజ సిద్ధంగా లభించే ప్రతిదీ
కాలంతో ,సంబంధం లేకుండా మార్కెట్లోకి రసాయన
రంగులతో కూడి అందుబాటు లోకి మన కండ్ల ముందు కదలాడుతూ ఉంటాయి
ఆఖరికి దుక్కి దున్ని పంటలు పండించే రైతు, పంటల దిగుబడికి వాడే ఎరువుల్లో కూడా నకిలీ ఈ కల్తీ వ్యవస్థలో నకిలీ అని పిలవబడే
((నకిలీ రాజు))
రాజ్యం కూలిపోవాలి
అస్లీ రాజు రాజ్యం రావాలి
సామాన్య ప్రజానీకం
సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలి
{{ఓ సగటు మానవుని ఆవేదన}}
ఇట్లు
రచయిత ఆరుకొండ శ్రీనివాస్
మంచిర్యాల