విద్యుత్ అమరవీరుల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివి. సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు.

విద్యుత్ అమరవీరుల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివి.

సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు.

 

 చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఆగస్టు 28 చెన్నారావుపేట.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ఉద్యమిస్తూ క్రమంలో హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన విష్ణు వర్ధన్, బాలస్వామి, రామకృష్ణ ల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని, విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై ఉద్యమించాలని సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు అన్నారు. 

బుధవారం నర్సంపేట డివిజన్ కేంద్రంలో విద్యుత్ అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ, వారి చిత్రపటాలకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా అడ్డూరి రాజు మాట్లాడుతూ

విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా 2000 సంవత్సరం ఆగస్టు 28న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాదులో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ప్రజల పైన, కార్యకర్తల పైన ,పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించి, నిరసనకారులపై కాల్పుల జరిపారని గుర్తు చేశారు. 

విష్ణు వర్ధన్, బాలస్వామి, రామకృష్ణ ల పోరాట తెగువ, ప్రాణ త్యాగాలతో విద్యుత్ ప్రైవేట్ కరణ ఆగిపోయిందని గుర్తు చేశారు. విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు జవహర్ లాల్, మనోహర చారి, స్వామి, రాజేందర్, వెంకన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment