ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంథనిలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్ ఎస్ ఎస్ మరియు చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్  పరిశయ్య  అధ్యక్షత వహించి మాట్లాడుతూ 1952 నుంచి తెలంగాణ ఏర్పడే వరకు జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలను జాగృతం చేయడం వివిధ వేదికలను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేసిన  ప్రొఫెసర్ జయశంకర్   తెలంగాణ రాష్ట్ర సాధనకు కారకులు అయ్యారని వారి కృషిని కొనియాడారు. చరిత్ర అధ్యాపకులు సతీష్  మాట్లాడుతూ నీళ్లు నిధులు, నియామకాల పైన తెలంగాణలో అనేక వేదికలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేసిన మహనీయుడు జయశంకర్  అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  ఐ క్యూ ఏ ఐ కోఆర్డినేటర్ కృష్ణ, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్. లక్ష్మీనారాయణ, అధ్యాపకులు అమర్నాథ్ ,ముకుందము, మానస ,రజిత, బోధ నేతరసిబ్బంది అశోక్, శ్రీనివాస్, ముజాహిద్ ,సుధాకర్, దుర్గరాజు మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment