తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించ తలపెట్టిన స్వచ్చ ధనం, పచ్చ ధనం పై మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో శనివారం ఇంచార్జి ఎంపీడీవో సురేష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా స్వచ్చ ధనం – పచ్చ ధనం కార్యక్రమంలో ఐదు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల గురించి వివరించారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేలా రోజువారి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బందితో పాటు కమిటీ బృందాలు కార్యక్రమం అమలు బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచించారు. స్వచ్చ ధనం – పచ్చ ధనం కార్యక్రమాలను జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. ప్రతి నెలలో మూడోవ శనివారం స్వచ్చ ధనం – పచ్చ ధనం దినోత్సవంగా జరపాలని ఆదేశించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపివో భాస్కర్, పి. హెచ్. సీ వైద్యాధికారిణి స్వాతి, సెర్ప్ ఏ. పి. ఎమ్ శైలజ శాంతి, ఉపాధి హామీ జేఈ కృష్ణస్వామి ఏ. పి. వో లావణ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రామ్మోహన్,అమల, సాయి శ్రీ, అమీనా, బాను, రాజ్ కుమార్, ప్రసాద్, శంకర్,తిరుపతి,
సూపర్వైజర్ సరస్వతి సిహెచ్ఎన్ లలిత ఏ. ఎన్. ఎమ్ లు, బాలభారతి,శ్రీలత సెర్ప్ సిబ్బంది, శ్రీనివాస్ ఎల్లమ్మ ఉపాధి హామీ సిబ్బంది ఏరువాక సతీష్, మల్యాల కుమార్, దొంతుల రాజయ్య,వేముల సతీష్, పోల్ దాసరి రవి అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.