బయ్యారం సిఎంసీ స్థలం గ్రామానికి చెందాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత.
బయ్యారం:చార్మినార్ ఎక్స్ ప్రెస్.
బయ్యారం గ్రామంలోని సిఎంసీ స్థలం గ్రామానికే దక్కాలని కోరుతూ స్థలంలో అక్రమ కట్టడాలు వెంటనే నిలిపివేయాలని కోరుతూ బయ్యారం మండలం అఖిల పక్షం పార్టీల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ కి రాత పూర్వకంగా వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఎంసీ స్థల రక్షణ కమిటీ అధ్యక్షులు గౌని ఐలయ్య, బయ్యారం పాక్స్ ఛైర్మెన్ మూల మధుకర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య,సిపిఐఎంల్ ప్రజాపందా జిల్లా నాయకులు ములుకూరి జగ్గన్న, బీజేపీ నాయకులు కురియాల చంద్రయ్య, వేల్పుల శ్రీనివాస్, బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి,సిపిఐంల్ న్యూడేమోక్రాసి నాయకులు,కొదుమూరి నాగేశ్వర్ రావ్, నేతగాని రాకేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.