ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి.
చార్మినార్ ఎక్స్ ప్రెస్: సెప్టెంబర్ 25,
పెద్ద శంకరంపేట్. ప్రమాదవశాత్తు తిరుమలాపూర్ చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పెద్ద శంకరంపేట ఏఎస్ఐ సునీత. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద శంకరంపేటకు చెందిన అవుసుల శ్రీనివాస్ చారి (58) మంగళవారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లాడన్నారు.శ్రీనివాస్ చారి టైలరింగ్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు అన్నారు.అతనికి భార్య ఇద్దరు కుమారులు. కుమార్తె ఉందన్నారు. బుధవారం ఉదయం అతని మృతదేహం తిరుమలాపూర్ చెరువులో తేలియాడడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.