24 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తికే ఆమె అంకితమని…ఆమె సేవలు ఘననీయమని పెద్దపల్లి జిల్లా హెచ్.ఎం అసోసియేషన్ అధ్యక్షులు జినుక మల్లేష్ అన్నారు. రామగిరి మండలం బేగంపేట జెడ్ పి హెచ్ పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయురాలు అల్లం లూర్థు మేరిని పదవీ విరమణ కార్యక్రమం స్థానిక ఉపాధ్యాయుడు మల్కా రామకృష్ణారావు అధ్యక్షతన జరగగా, మల్లేష్ గా విచ్చేశారు. ప్రతి పాఠశాలలో ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా శాలువాలు పూలుమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ లు కొమురయ్య (రామగిరి), ఇరుగరాళ్ల ఓదెలు( ముత్తారం), దాసరి లక్ష్మి (మంథని), టి.విమల (పాలకుర్తి) హెచ్.ఎం లు తూము శోభన్ రావు,లక్ష్మి, పద్మారాణి,మోసం శ్రీనివాస్, ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.