వాహనాల తనిఖీల్లో 140 కిలోల ఎండు గంజాయి లభ్యం – జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్

జహీరాబాద్ నియోజకవర్గం చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి సెప్టెంబర్ 11

జహీరాబాద్ నియోజకవర్గంలోని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు వాహనాలు తనిఖీ చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో నిషేదిత 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేఉకున్నారు. 140 కిలోల ఎండు గంజాయి, ఇద్దరు వ్యక్తులు, మహీంద్ర బొలేరో మ్యాక్స్ పికప్ వాహనం, రెండు సెల్ ఫోన్ లు, నాలుగు సిమ్ కార్డ్స్ సీజ్ చేశారని వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్. ఈ సందర్భంగా చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపియస్ మాట్లాడుతూ.నమ్మదగిన సమాచారం మేరకు నిన్న తేది 09-09-2024 నాడు సాయంత్రం 5 గంటల సమయంలో చిరాగ్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి తన సిబ్బంది, సిసియస్ సిబ్బందితో కలిసి చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల ఆనంద్ ధాబా ముందు ఎన్‌హెచ్-65 రోడ్ పై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్ర బోలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అట్టి వాహనం ట్రాలి పై బ్లూ కలర్ పాలిథిన్ కవర్ కప్పి ఉన్నది. అట్టి వాహనాన్ని పక్కకు పెట్టించి అందులో గల ఇద్దరు వ్యక్తులను కిందకు దించి వివరాలు తెలుసుకొనగా ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు లఖన్, సిద్దిరామ్ అని తెలిపినారు. అట్టి బోలెరో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ట్రాలీ క్రింది భాగంలో చెక్కలను ఏర్పాటు చేసి దాని క్రింద 140 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనపరుచుకోవడం జరిగింది.నేర ప్రవృత్తి : కర్ణాటక రాష్ట్రం బాల్కికి చెందిన మల్లు గొండ అనే నేర ప్రవృత్తి గల వ్యక్తి నిషేదిత ఎండు గంజాయి ఓడిశా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి రాహుల్ అనే వ్యక్తి ద్వారా ఎండు గంజాయి సేకరించి అట్టి గంజాయిని బాల్కికి చెందిన లఖన్, సిద్దిరామ్, సునిల్, కిరణ్ మల్లేశ్ నాయక్ ల ద్వారా ఎవరికి తెలియకుండా కార్లలో, బోలెరో వాహనాలలో తీసుకువచ్చి మల్లుగొండకు అప్పగించగ అతను అట్టి గంజాయిని మహారాష్ట్రలోని ముంబై, పుణె, లాతూర్ వివిద పెద్ద సిటిలలో ఎక్కువ దరకు అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నాడు అన్నారు.నిందితుల వివరాలు: 1) లఖన్ తండ్రి జనార్ధన్, వయసు: 29 సం.లు, కులం, మరాఠ, వృత్తి డ్రైవరు, గ్రామము శంషాపూర్ వాడి, బల్కి తాలూకా, బీదర్ జిల్లా కర్నాటక రాష్ట్రం.
2) సిద్దిరామ్ తండ్రి జగన్నాథ్ వయసు 28 సం.లు, కులం యాదవ్, వృత్తి లేబర్, గ్రామము బసవేశ్వర్ చౌక్ బీర్ దేవ్ గల్లీ బాల్కి, బీదర్ జిల్లా కర్నాటక రాష్ట్రం.
మిగతా వ్యక్తులు మల్గొండ, రాహుల్, కిరణ్, సునిల్ మల్లెశ నాయక్ లు పరారీ లో ఉన్నారు.ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగాత వారిని కూడా త్వరలో అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరుగుతుంది అన్నారు. ఇట్టి కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డ్ లు ప్రకటించారు.
ఈ ప్రెస్ మీట్ నందు జహీరాబాద్ డియస్పి కే. రామ్ మోహన్ రెడ్డి, జహీరాబాద్ టౌన్ సర్కల్ ఇన్స్పెక్టర్ యస్. శివలింగం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ ఇన్స్పెక్టర్, ఎస్ ఎన్ ఏ బి ఇన్స్పెక్టర్ రమేష్, సి‌సి‌ఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, చిరగ్ పల్లి ఎస్ఐ కె. రాజేందర్ రెడ్డి, సి‌సి‌ఎస్ ఎస్ఐ శ్రీకాంత్, మాణిక్ రెడ్డి, ఏ‌ఎస్‌ఐ, సి‌సి‌ఎస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment