కుక్కమూడి సురేష్ దశ దిశ కర్మలకు హాజరైన సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)నవంబర్ 24.
బయ్యారం మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు కుక్కమూడి సురేష్ ఇటీవలే కొంతమంది వ్యక్తుల వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.ఆదివారం కుక్కమూడి సురేష్ దశ దిశ కర్మలకు సింగిల్ విండో డైరెక్టర్ తెల్లం బిక్షం గారి ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి గారి సహకారంతో క్వింటా రైస్ బ్యాగ్స్ అందించడం జరిగింది. అంతే కాకుండా వారి దిశ దశ కర్మలకు హాజరై సురేష్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి గారు సింగిల్ విండో డైరెక్టర్ తెల్లం బిక్షం గారు, వేల్పుల శ్రీనివాస్ గారు, ఏనుగుల రాకేష్ గారు, కుక్కమూడి జనార్ధన్, కుక్కమూడి బాబు,కుక్కమూడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.