అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపించుకుందాం 

అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపించుకుందాం 

 

 

భద్రాచలం:ఈనెల 27 న జరగబోవు శాసనమండలి ఎన్నికలలో 

టి పి టి ఎఫ్ బలపరుస్తున్న టి ఎస్ యు టి ఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులుగా మరొక మారు గెలిపించుకుందామని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టి పి టి ఎఫ్) పూర్వ రాష్ట్ర కార్యదర్శి, ఉపాధ్యాయ దర్శిని సంపాదక వర్గ సభ్యులు మునిగడప రామాచారి, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్) జిల్లా అధ్యక్షులు బెండ బోయిన మురళీకృష్ణ ఉపాధ్యాయులను కోరారు. స్థానిక టీఎస్ యుటిఎఫ్ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.విద్యా రంగ, ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యల పట్ల, వాటి పరిష్కారం పట్ల స్పష్టమైన అవగాహన , సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఫెడరేషన్ సంఘాల అభ్యర్థిని ఆదరించి ఉపాధ్యాయులు తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును అలుగుబెల్లి నర్సిరెడ్డికి వేసి మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి 2019 నుండి శాసనమండలిలో ఉపాధ్యాయ, అధ్యాపకుల గొంతుకగా నిరంతరం పనిచేశారని, శాసన మండలి జరిగిన అన్ని రోజులు సభకు హాజరు కావడంతో పాటు వాయిదా తీర్మానాలు, ప్రశ్నోత్తరాలు, పిటిషన్లు, ప్రత్యేక ప్రస్తావనల ద్వారా అనేక సమస్యలను ప్రభుత్వానికి నివేదించి పరిష్కారం కోసం పట్టుదలతో కృషి చేశారని,శాస్త్రీయ దృక్పథం, నిజాయితీ, నిబద్ధత, అవగాహన కలిగి విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శ్రమించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోడే విజయ్ కుమార్, ఏ.వెంకటేశ్వర్లు, ఎం.సత్యనారాయణ, ఎస్.ఎన్.వి.ఆర్.రాజా శ్రీనివాస్, కే.శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment