ఫిల్టర్ వాటర్ పర్మిషన్ లేని వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఎలిగేండ్ల వెంకటేష్ ముదిరాజ్
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ నారాయణపేట జిల్లా నారాయణపేట మున్సిపాలిటీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎలిగేండ్ల వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఫిల్టర్ వాటర్ పర్మిషన్ లేని వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ సునీత మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఫిల్టర్ వాటర్ నిర్వహిస్తున్న వారు చాలామంది ఉన్న,వాటిలో ఏ ఒక్కరు కూడా ఫిల్టర్ వాటర్ నడుపుతున్న వారు మున్సిపాలిటీ నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు. కావున వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని, ప్రతి ఒక్క ఫిల్టర్ వాటర్ సంబంధించిన స్థలాన్ని అధికారులు పరిశీలించి, తనిఖీలు చేసి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ఇంచార్జీ ఎడ్ల కుర్మయ్య, అసెంబ్లీ అధ్యక్షుడు గణేష్, మద్దూరు మండల అధ్యక్షులు వెంకటయ్య, జిల్లా సభ్యులు సంద వెంకటేష్ పాల్గొన్నారు