మంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన లద్నాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చొరవతో రామగిరి మండలంలోని లద్నాపూర్ గ్రామానికి టీజీఎస్ ఎన్పీడీసీఎల్ మరమ్మత్తుల కోసం, గ్రామ అభివృద్ధి కోసం, లద్నాపూర్ గ్రామ ఎస్సీ కాలనీ కి సంబంధించిన కరెంట్ లైన్ కోసం అడగగానే గ్రామానికి 6,30,000/- రూపాయలను సాంక్షన్ చేసి వెంటనే పనులు మొదలు పెట్టడం జరిగింది. గ్రామానికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కి గ్రామ ప్రజలు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ ఈశ్వర్ ప్రసాద్, డి ఈ ప్రభాకర్, ఏ ఈ ఈ మహేందర్ రెడ్డి, ఎల్ ఎం రమేష్, ఏ ఎల్ ఎం అంజి మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు తొగరి చంద్రయ్య, అడ్డూరి ప్రవీణ్, గొర్రె నరేష్ యాదవ్, అడ్డూరి శ్రీకాంత్, సత్యం మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.