డి ఈ ఓ నారాయణపేట మరియు విద్యాశాఖాధికారుల చేతుల మీదుగా డీ.టీ ఎఫ్ నూతన సంవత్సర డైరీలు మరియు క్యాలెండర్ల ఆవిష్కరణ
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ 2025 నూతన సంవత్సరానికి సంబంధించిన, డైరీలు మరియు క్యాలెండర్లను నారాయణపేట జిల్లా కేంద్రంలోని డీ.ఈ.ఓ కార్యాలయంలో, గౌరవ జిల్లా విద్యాధికారి గోవిందరాజులు చేతుల మీదుగా
ఆవిష్కరించుకున్నాము డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, గత రెండు దశాబ్దాల నుంచి నాణ్యమైన విద్య కోసం, శాస్త్రీయమైన విద్య కోసం, అందరికీ సమాన విద్య అందుబాటులో ఉండే, కామన్ స్కూల్ విద్యావిదానం కోసం ఉద్యమిస్తూనే ఉందిసామాజిక బాధ్యతతో వృత్తినిబద్దతతోఉపాధ్యాయుల హక్కుల కోసం పాలకవర్గాలని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉందినూతన జాతీయ విద్యావిధానం వంటి తిరోగమన విధానాలని వ్యతిరేకిస్తూనే ఉందిఅంతేకాకుండా పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం, పాఠ్యపుస్తకాలు సమయానికి అందించడం కోసం, యూనిఫామ్స్ సత్వర కాలంలో విద్యార్థులకు అందించడం కోసం, కార్పొరేట్ విద్యను రద్దు చేయడం కోసం, తన గొంతును వివిధ సందర్భాల్లో వినిపిస్తూనే ఉంది.
అంతేకాకుండా ఉపాధ్యాయులకు రావలసిన డి.ఎలు పి.ఆర్సి వంటి విషయాల్లో కూడా డి. టీ.ఎఫ్ పోరాడుతున్నది. కేవలం ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు మాత్రమే కాకుండా ప్రజాస్వామికమైన ఆకాంక్షలున్న ప్రతీ ఉద్యమంలోనూ డి. టీ. ఎఫ్ భాగస్వామ్యం ఉంటుందిఈ సంవత్సరానికి సంబంధించి డైరీలు మరి క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో, విద్యాశాఖాధికారులుఏ.ఎం.ఓవిద్యాసాగర్,రాజేందర్,యాదయ్య శెట్టి,సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి గార్లు పాల్గొన్నారు.సంఘ బాధ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర జిల్లా అధ్యక్షురాలు హైమావతి ఉపాధ్యక్షులు పరంధాములు. సహాయ కార్యదర్శి స్పందన, మక్తల్ మండల బాధ్యురాలు పరంజ్యోతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు