అధికారులతో చార్మినార్ ఎక్స్ ప్రెస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
కాగజ్ నగర్ పట్టణంలోని చార్మినార్ ఎక్స్ ప్రెస్ (2025) నూతన సంవత్సర క్యాలెండర్ కాగజ్ నగర్ డివిజన్ సబ్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల ,డి.ఎస్.పి రామానుజన్, తాసిల్దార్ కిరణ్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వార్లు మాట్లాడుతూ, పత్రికలు ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రజల పక్షాన నిలబడాలని, ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేసేది పత్రిక ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల పక్షాన నిలబడేదే మీడియా అని ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. మీడియా ప్రతిపక్ష హోదాను నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ఎండి. అర్షద్ అలీ తోపాటు వివిధ పత్రిక పాత్రికేయులు వెంకన్న , చందు , రతన్ , యూసుఫ్ సతీష్ , రాజు తదితరులు పాల్గొన్నారు.