Latest-News

Latest News

IMG 20241225 WA0024

క్రీస్తు మార్గంలో పయనించాలి

క్రీస్తు మార్గంలో పయనించాలి  సూర్యాపేట జిల్లా రియల్ఎ స్టేట్ వ్యాపార అసోసియేషన్అధ్యక్షులు పంతంగి వీరాస్వామి గౌడ్.   ప్రతి ఒక్కరు సమాజంలో శాంతి, ప్రేమ, కరుణ స్థాపన కు ప్రభువైన  ఏసుక్రీస్తు మార్గంలో పయనించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రoలో ఆ యూనియన్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్ నివాసం లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరై జలగం సత్యం గౌడ్ కు సాల్వతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్టింగ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడా రు. క్రీస్తు మార్గాన్ని అనుసరించేదుoకు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ప్రజలు క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నారని వివరించారు. ప్రతి ఒక్కరు క్రీస్తు ను ఆదర్శం గా తీసుకొని ఆకలితో ఉన్నా పేదల ఆకలి తీర్చేలా ప్రేమ కరుణ తో సేవ కార్యక్రమాలు చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగల సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ గౌరవ సలహాదారుడు మాది రెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు కడారి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి పట్టేటి కిరణ్ ఆకుల మారయ్య గౌడ్ ఐతగాని మల్లయ్య గౌడ్ జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ బుర్ర సరస్వతి జలగం రజిని జలగం స్రవంతి జలగం రమేష్ జలగం కిరణ్ గుణగంటి శారద రాపర్తి జానయ్య దండి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
IMG 20241225 WA0022

రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన  కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్

రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన  కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ మెదక్ జిల్లా కొల్చారం మండల చిన్నగన్పూర్ గ్రామ శివారులో ఎలిపాడు వద్ద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని గౌరవ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు శ్రీ దామోదర రాజనర్సింహ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ గారి సమక్షంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ సభ్యుల తరఫున శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత దర్శనానికి వచ్చుచున్న సందర్భంలో వారికి ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ కొల్చారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
IMG 20241225 WA0021

మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజపేయి 100వ. జయంతి వేడుకలు ఘనంగా

మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజపేయి 100వ. జయంతి వేడుకలు ఘనంగాn మండల కేంద్రంలో బుధవారం భారత రత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి 100వ. జయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జయంతి వేడుకలను ప్రారంభించారు. ముధోల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ మాట్లాడుతూ, అటల్ బిహారి వాజపేయి భారతదేశ అభివృద్ధికి చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ, దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన నేతగా ఆయనను కొనియాడారు. ఆయన ఆలోచనలు, కృషి, నైతికత దేశ రాజకీయాల్లో అపూర్వమని తెలిపారు.వాజపేయి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ సర్డ, రవి పాండే, మండల అధ్యక్షులు యథలం చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు శివాజీ పటేల్, లక్ష్మణ్ రెడ్డి, దేవదాస్ పటేల్, మారుతి, ఏల్లప్పతో పాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
IMG 20241225 WA0916

తూప్రాన్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు….

తూప్రాన్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిరుపేద మహిళలకు చీరలు,బట్టలు పంపిణీ శఫర్డ్ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో క్యాడ్బరీస్ చాకోకుకీస్ బిస్కెట్లు పంపిణీ చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో డిసెంబర్ 25 ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని చర్చలలో ఘనంగా క్రిస్మస్ పండుగలు జరుపుకున్నారు ప్రేమ,కరుణ,దయ,జాలి, శాంతి, సౌభాగ్యాలను అందించి సమస్త మానవాళిలో ఆనందం నింపిన క్రిస్తు అందరికీ ఆదర్శప్రాయం అని అందుకే ఏసు ప్రభువు మీ కొరకు పుట్టియున్నాడని తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ దుర్గారెడ్డి అన్నారు. బుధవారం పోతరాజుపల్లి పిలదేల్పీయా చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ యెహోవా నీతి మంతులను, నిజాయితీ పరులను ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదించి వెన్నంటి ఉండి కాపాడుతాడని తెలిపారు. ఏసు పుట్టింది నీ కోసమే… ఏసు చనిపోయింది కూడా నీ కోసమే.. తిరిగి లేచింది నీ కోసమే.. త్వరలో రాబోతుంది కూడా నీ కోసమే… అని ఉద్ఘాటించారు. సాటి మానవుల పట్ల ప్రేమ కరుణ, దయ చూపాలని ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా అదృష్టం అన్నారు. ఈ లోకం ప్రేమ హృదయాన్ని గాయ పరుస్తుంది, కానీ ఏసాయ్య మాత్రం ప్రేమతో గాయపడిన హృదయాన్ని బాగుచేస్తాడని, దేవుని ఆదరణ ఎంత గొప్పదో అర్ధం అవుతుందన్నారు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన నీలో.. నాలో.. అందరిలోనా వ్యాపించి ఉన్నాడని అన్నారు. విశ్వమానవాలికి ప్రేమ తత్వంతో వెలుగు పంచిన కరుణామయుడు ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షఫర్డ్ స్వచ్ఛంధ సంస్థ అధినేత రొయ్యూరు సురేష్ అందజేసిన క్యాడ్బరీస్ చాకో కుకీస్ బిస్కెట్లు పంపిణీ చేశారు. అలాగే మహిళలకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కౌన్సిలర్ దుర్గారెడ్డి, భావనీ అంజయ్య యాదవ్ పంతులు, మాజీ వార్డ్ సభ్యులు పరశురామ్, మరియు పెద్దలు గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్. డాక్టరేట్ జానకి రామ్ గారు, గైని బైటి భాస్కర్ గౌడ్, చర్చి పాస్టర్ ఎస్ఎన్ బెన్నీ, శ్రీలత, చర్చ్ సభ్యులు. శంకర్, శ్రీను, నర్సింలు, ప్రభాకర్, ప్రవీణ్, డేవిడ్, కుమార్, భూపాల్, సాయి, రమేష్, సుబ్బారావు, శేఖర్, ఏసుదాస్, హోసన్న, యాదగిరి, లక్ష్మణ్, రాజు, నర్సింగ్, ప్రదీప్, అనంతరావు, సాయి, నర్సింలు, మహేష్, నాగేష్, రవి, అనంతరాం, హోసన్నా, పరమేశ్, ప్రవీణ్, నాగేష్, సత్తన్న, జాషువా సునీల్, భూపాల్, వినయ్, సుబ్బారావు, విజయ్ కుమార్, సామ్యూల్, డబ్బ నాగరాజు యాదవ్, మల్లిఖార్జున్ గౌడ్, బాలయ్య, గడ్డం ప్రశాంత్ కుమార్, తోపాటు క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.
IMG 20241225 WA2074

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్

రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ చార్మినార్ ఎక్స్ప్రెస్ డిసెంబర్ 25 కొల్చారం మండలం   మెదక్ జిల్లా కొల్చారం మండల చిన్నగన్పూర్ గ్రామ శివారులో ఎలిపాడు వద్ద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని గౌరవ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు శ్రీ దామోదర రాజనర్సింహ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ గారి సమక్షంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ సభ్యుల తరఫున శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత దర్శనానికి వచ్చుచున్న సందర్భంలో వారికి ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ కొల్చారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
GridArt 20241225 201542287 scaled

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ 

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్  క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈరోజు నారాయణాఖేడ్ మండల్ చప్తా కే గ్రామంలో చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్  ఈ సందర్బంగా కే శ్రీనివాస్ కేక్‌ కట్ చేసి, క్రైస్తవ సోదర,సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు పీసీసీ సభ్యులు మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని అన్నారు అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని కే శ్రీనివాస్ అన్నారు క్రిస్మస్ వేడుకలను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఏసు ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం లో నారాయణరెడ్డి, బక్షిరాం, కొండల్ రెడ్డి, పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరీమణులు, వైజనాథ్, అమృత్, సాయిబాబా, బాబురావు, జైవత్, దావీద్, మారుతీ, నర్సప్ప, సంజీవ్, శివరాజ్ తదితరులు కలరు
GridArt 20241225 200751601 scaled

క్రిస్మస్ పర్వదినంగా పాల్గొన్న మెట్టు కుమార్

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్  పటాన్చెరు డివిజన్ పరిధిలో ని జెపి కాలనీలో గల మరనాద చర్చి మరియు శాంతినగర్ కాలనీలో గల సిఎస్ఐ చర్చిలను సందర్శించి క్రైస్తవ సహోదరీ సహోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.
IMG 20241225 WA14351

రుద్రారం గ్రామంలో సియస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు

రుద్రారం గ్రామంలో సియస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు   నిన్నటి దినమున టిఎస్ఐ చర్చి రుద్రారం గ్రామంలో క్రిస్మస్ పండుగ ఆరాధన గంభీరంగా జరిగింది ఉదయం నాలుగు గంటల సమయంలో ఊరేగింపులో స్త్రీలు పురుషులు పిల్లలు పాల్గొన్నారు ఇందులో స్త్రీల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంది సాయంత్రం చిన్నపిల్లలు స్కిట్ డ్యాన్స్ లు చెశారు పాస్టర్ పుర్ర జాన్ వెస్లి దైవసందేశం అందించారు ఏసుక్రీస్తు మానవులను రక్షించడానికి పాప బంధకాల నుండి విడిపించుటకు వచ్చారా అని తెలియజేశారు ఇచ్చి ఆరాధనలో రుద్రారం సంఘం అంతయు పాల్గొన్నారు
GridArt 20241225 194825215 scaled

క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ చేర్మెన్ వై.నరోత్తం.

క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ చేర్మెన్ వై.నరోత్తం.   క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్ గ్రామంలోని చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో టిఎస్ ఎస్సిసిడి సి మాజీ చేర్మెన్ వై.నరోత్తం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపి గ్రామ పెద్దలు పాస్టర్ లతో కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేయడం జరిగింది,ఈ సందర్భంగా అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ విశ్వ మానవాళికి క్రీస్తు బోధనలు ఆదర్శనీయమన్నారు క్రిస్మస్ పండుగ ప్రేమ,శాంతి సందేశాన్ని లోకానికి అందించడం జరుగుతుందన్నారు. మానవాళిపై కరుణామయుడి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు రామకృష్ణారెడ్డి,సుభాష్,మాజీ ఎంపీటీసీ మాణిక్ రెడ్డి,వాక్యా ఉపదేశకులు స్టార్లిన్,సంఘ కాపరి వీరేందర్,సంఘ పెద్దలు దేవదాస్,అశోక్,రవి,నర్శింలు,రాములు,సురేష్,లక్ష్మన్, మహిళలు,చిన్నారులు, స్థానికులు పాల్గొన్నారు.
IMG 20241225 WA2005

యానాల మల్లమ్మ ను పరామర్శించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి

యానాల మల్లమ్మ ను పరామర్శించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి గత కొద్దిరోజులుగా అనారోగ్యం బారిన పడిన యానాల యాదగిరి రెడ్డి సతీమణి యానాల మల్లమ్మ మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని సంబంధిత వైద్యులతో ఫోన్ లో మాట్లాడి సలహాలు సూచనలను తీసుకుని వారికి వివరించారు.