పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలని…. భూమి విరాళం
చందుర్తి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ దుబాయ్ ఎన్నారై మోతే బాబు పుట్టిన గడ్డపై మమకారంతో..తన ఊరిలో శివాలయం నిర్మాణానికి సుమారు 25 లక్షల విలువ గల భూమిని ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు….
శుక్రవారం రోజున గ్రామ పుర ప్రముఖులు శివ భక్తులు, శివాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు…ఈ సందర్భంగా ఎన్నారై మోతే బాబు…తన స్థల పేపర్లను గుడి నిర్మాణం కొరకు గ్రామస్తులకు అందజేసి తన గొప్ప భక్తి భావాన్ని చాటుకున్నారు… వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖ ఎన్నారై బొజ్జ కిషోర్ విగ్రహదాతను… స్థలాన్ని విరాళంగా ఇచ్చిన మోతే బాబును గ్రామస్తులు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.. ఎన్నో రోజుల శివ భక్తుల చిరకాల కోరిక త్వరలోనే నెరబోతుందని మాజీ సర్పంచ్ గొట్టే ప్రభాకర్ తెలిపారు… శివాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో గ్రామస్తులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు… ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పులి సత్యం రేణుక, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ అజిమ్, గ్రామ పుర ప్రముఖులు.. కత్తి తిరుపతి గౌడ్, దారం చందు, దేవుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.