చాకరిమెట్లలో హనుమాన్ ఆలయంలో ఆర్యవైశ్య మహిళలచే లక్ష పుష్పార్చన.
— పాల్గొన్న ఎమ్మెల్యే సునితా రెడ్డి
నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలో నర్సాపూర్ గజ్వేల్ ప్రధాన రహదారి అటవీ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన హనుమాన్ దేవాలయంలో వసంత పంచమి పర్వదిన సందర్భంగా సోమవారం వసంత పంచమి సందర్భంగా ఆర్యవైశ్య మహిళలచే నిర్వహించిన క్షపూల అర్చన కార్యక్రమం ఘనంగా జరిగింది
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ అర్చకులు ఆంజనేయ శర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆర్య వైశ్య సంఘం మహిళా సభ్యులు సునితారెడ్డి ని ఘనంగా శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు జ్ఞానేశ్వర్ గుప్త,ఇమ్మడి శ్రీనివాస్, గూడూరి యాదా గౌడ్, చంద్ర కళా శ్రీశైలం యాదవ్,నర్సింగ్ రావు, ప్రభాకర్ రెడ్డితదితరులుపాల్గొన్నారు.