కృష్ణ వికారాబాద్ రైల్వే లైన్ వెంటనే మంజూరు చేయాలి
సిపిఎం డిమాండ్
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలలోనైనా కృష్ణ వికారాబాద్ రైల్వే లైన్, సైనిక్ స్కూల్ నవోదయ పాఠశాలలను వెంటనే మంజూరు చేయాలని , పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు జాతీయ హోదా కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుంజనూర్ ఆంజనేయులు సీనియర్ నాయకులు భరత్ కుమార్ డిమాండ్ చేశారు
శుక్రవారం రోజు మాగనూరు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై నిరసన చేయడం జరిగింది
ఫిబ్రవరి 1 నుండి కేంద్రంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా నారాయణపేట జిల్లా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నదని నారాయణపేట జిల్లా కేంద్రం అభివృద్ధి కొరకు 500 కోట్ల ప్రత్యేక నిధులు బడ్జెట్ లో కేటాయించాలని కోరారు .
ఇటీవల జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం కూడా అందజేయడం జరిగిందని గుర్తు చేశారు
12 సంవత్సరములుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ గత బడ్జెట్ లన్ని నారాయణపేట జిల్లాకు నిరాశ కలిగించాయని ఇప్పుడన్న నారాయణపేట జిల్లా ప్రజల ఆశలు నేరవేర్చాలని కోరారు .
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సగరం ఆంజనేయులు పుంజనూర్ బాలరాజ్ కే నరసింహ నయీమ్ పుంజనూర్ మహాదేవ్ వెంకటప్పతదితరులు పాల్గొన్నారు