లక్షల డప్పులు వెయ్యిల గొంతులకు సామాజిక స్పృహతో అన్ని వర్గాల న్యాయం జరగాలి

లక్షల డప్పులు వెయ్యిల గొంతులకు సామాజిక స్పృహతో అన్ని వర్గాల న్యాయం జరగాలి

 

 జాతీయ మానవ హక్కుల సంఘం నార్కోల్ న్ డప్పుల వితరణ

 

 

ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబోయే లక్ష ల డప్పులు వెయ్యిల గొంతుల కార్యక్రమానికి సామాజిక స్పృహతో అన్ని వర్గాల న్యాయం జరగానే సంకల్పంతో శుక్రవారం జాతీయ మానవ హక్కుల సంఘం , నార్కోల్ ఎం.ఎం.ఎస్ జిల్లా అధ్యక్షురాలు మేకల లత కి డప్పుల వితరణ ఇవ్వడం జరిగింది.అలాగే అన్నిరకాల బహుజనులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని అలాగే ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ తల పెట్టిన సాంస్కృతిక కార్యక్రమం విజయవంతం కావాలి అని. అలాగే ఈ విజయంతో అన్ని రకాల వర్గాల వారు కూడా చైతన్యం పొంది వారు కూడా వారి హక్కుల కోసం కృషి చేయాలి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహాజన మహిళా సమాఖ్య ఎంఎంఎస్ కమిటీ కి డప్పులు వితరణ ఇవ్వడం జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి మరియు పొడుతూరి ప్రేమ్ సాయి పాల్గొన్నారు. ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేకల లత, ఎం.ఎస్.పి ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఇన్చార్జ్ అలవాల రాజా పెరియార్, జిల్లా నాయకులు కొప్పుల తిరుపతి, సీనియర్ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు, కోట ప్రభాకర్,బోయిన ప్రశాంత్, కమ్మిల నరసింహారావు, జిల్లా కార్యదర్శి కొప్పుల నాగమణి, పట్టణ నాయకులు నిర్మలమ్మ రావుల, నీలాల కృష్ణవేణి, ఎస్కే రహిమ బోయిన విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment