కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిక

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిక

 

-మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..

-ఆరు గ్యారెంటీ లపై గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారు..

-స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు..

 

 

     మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లేష్, సాయిలు మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పైలెట్ రోహిత్ రెడ్డి ,సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పైలెట్ రోహిత్ రెడ్డి , వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆరు గ్యారెంటీలపై గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు అన్నారు. దేవుడు లాంటి కేసీఆర్ ను వదులుకొని దున్నపోతుకు ఓట్ల వేసినందుకు గ్రామాల్లో ప్రజలు బాధపడుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, సర్పంచ్ బసిరెడ్డి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment