జనంసాక్షి 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ పత్రికలు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలి కృష్ణ మండల తాసిల్దార్
కృష్ణ, జనవరి 07 జనం సాక్షి దిన పత్రిక జనం గొంతుకగా పని చేస్తున్నదని,పత్రికలు ప్రభుvత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని కృష్ణ ఎస్సై నవీద్ అ న్నారు.మంగళవారం కృష్ణ మండలం పోలీస్ స్టేషన్ లో 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతు క్యాలెండర్స్ ను ఆవిష్కరించారు,అనంతరం వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ఉన్న పత్రికల్లో జనం సాక్షి దినపత్రిక ప్రత్యేక స్థానం అన్నారు, ప్రజా సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు, పత్రికలు ప్రజ లను చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్యాన్ని
కాపాడాలన్నారు, ప్రజలు ప్రభుత్వాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో పత్రికలు కీలక పాత్ర పోషించాలన్నారు,
ప్రజలకు, ప్రభుత్వానికి, మధ్య వారధిలా పనిచేయాలి, ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ, అభివృద్ధి, పథకాలు, ప్రజలకు చేరవేయండంలో వీటి పాత్ర కీలకమని అన్నారు, పత్రికలు పనిచేసే జర్నలిస్టులకు, స్వేచ్ఛ ఉండాలని అన్నారు, ఎవరికీ భయపడకుండా నిజా లు, నిర్భయంగా, వార్తలో రాసి నిజ నిజాలను, నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పాత్రికేయుల పై ఉందని అన్నారు, వార్త సేకరణలో ముందు భాగాన నిలుస్తున్న జనం సాక్షి రిపోర్టర్లు బృందానికి, పత్రిక సంస్థ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు, సమాజానికి నిత్యం సమాచార సేవలు అందిస్తూ జనంసాక్షి పత్రిక దిక్సూచిగా నిలిచిందని అన్నారు,మీడియా ప్రతినిధులు ఎంతో గురుతురమైన బాధ్యతతో సమాజంలో సమాచార స్రవంతిని ప్రసరింప చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న పత్రికలు సమస్యలను అనునిత్యం ప్రజల ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నారని అన్నారు.జనం సాక్షి దినపత్రిక రిపోర్టర్ అనునిత్యం అనేక సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు బాధితులకు పక్షాన నిలిచి న్యాయం చేయగలుగుతున్నారని, అన్నారు. ప్రజల గొంతుకుగా నిలుస్తున్న జనంసాక్షి పత్రిక మరింత అభివృద్ధి సాధించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచిం చారు. రాగద్వేషాలకు తావు లేకుండా అక్షరమే ఆయుధంగా ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో జరిగే అన్యాయాలను ఎత్తి చూపే విధంగా జనం సాక్షి దినపత్రిక పనిచేయడం అభినందించారు,ఈ సంవత్సరంప్రజలకుశుభాలుజయాలు,సంతోషాలు,సిరిసంపదలతో,ఆయురారోగ్యాలు,కలగాలన్నారు,ఈ కార్యక్రమంలో, తహశీల్దార్ దయాకర్ రెడ్డి, సిద్ధరామ్ రెడ్డి మాలిపాటిల్ గుడేబల్లూర్, ఎస్సై నవీద్, ఎఎస్ఐ సురేంద్ర బాబు, బిజెపి అధ్యక్షుడు జి శ్రీనివాసులు, కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు షేక్ సర్పరాజు, పల్లే సురేష్, దేవేంద్ర తంగడి, మ్యాకల్ భీమ్, రాఘవేంద్ర పూజారి గుడేబల్లూర్, సురేష్ సజ్జన్ రిపోర్టర్, అమర్ నాథ్ గౌడ్ తదితరులు,నాయకులు,జర్నలిస్టులు పాల్గొన్నారు