విశ్వ కర్మ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా జలంధర్
అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన శ్రీ కోటి జలంధర్ నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం చేతుల మీదుగా శ్రీ కోటి జలంధర్ నియామక పత్రాన్ని అందుకున్నారు. తనను నియమించిన వారికి జలంధర్ కృతజ్ఞతలు తెలిపారు.