దిన స్థితిలో జైపాల్
అనారోగ్యంతో బాధపడుతున్న చూడడానికి జాడలేని నాయకులు
నాడు పార్టీ బలోపేతానికి కృషి
వట్టిపల్లి మండల్ గొర్రెకల్ గ్రామానికి చెందిన జైపాల్
నిజాయితీకి మంచితనానికి మారుపేరు ఆయన పేదరికంలో విపరీతమైన కుటుంబ పరిస్థితుల్లో సైతం పార్టీని వీడకుండా తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తి వట్పల్లి మండలంలోని గొర్రెకల్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జైపాల్.జిల్లా వ్యాప్తంగా బీజేపీ గొర్రెకల్ జైపాల్ అంటే గుర్తుపట్టని వారు ఉండరు.ప్రస్తుతం ఆయన పేదరికనికి ఆరోగ్య సమస్య ప్రాణ సంకటంగా మారింది.గత కొద్ది రోజులుగా పక్షవాతంతో తీవ్ర అనారోగ్య పరిస్థితులను జైపాల్ ఎదుర్కొంటున్నాడు.ఈ క్రమంలో ఆయన ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు బీజేపీ పార్టీ నాయకులు సైతం కనీసం జైపాల్ ను పలకరించిన పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మండలంలో జైపాల్ ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించారు.బీజేపీ పార్టీ కి ఉమ్మడి మండలంలో ప్రత్యేక కార్యక్రమాలు చేసి పార్టీ బలోపేతం చేసిన వ్యక్తి జైపాల్ కానీ ఇప్పుడు లెవలేని పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా ఇబ్బందులు గురవుతున్నాడు. గతంలో తన తల్లికి పక్షపాతం వస్తే అన్ని తానై సేవ చేసి మండలంలోని మానవతావాదులచే మన్నలను పొందాడు.తన తల్లి చనిపోతే మీడియాలో ‘జైపాల్ తల్లి చనిపోయింది’ అంటూ ప్రత్యేక కథనాలు సైతం వచ్చాయంటే ఆయన తన తల్లికి తాను చేసిన సేవను ఎవరు మరవలేదు. కానీ అతనే తన అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా అపన్నహస్తం కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమని తన మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.