తల్లిదండ్రుల వలె లాలించి వారిని పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత శిశు గృహ నిర్వాహకులపై ఉంది
జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
భద్రాచలం:తల్లిదండ్రులకు భారమై అలాగే పెంచి పోషించలేక అనాధగా వదిలేసిన చిన్నపిల్లలను, అంగవైకల్యం ఉన్న చెవిటి మూగవారు ఉన్నా వారికి భద్రాచలంలోని శిశు గృహ అనాధ పిల్లల ఆశ్రమంలో వారికి అన్ని సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రుల వలె లాలించి వారిని పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత శిశు గృహ నిర్వాహకులపై ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు.శుక్రవారం భద్రాచలంలోని శిశు గృహ అనాధ పిల్లల ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఆశ్రమంలోని పరిసరాలను పిల్లలకు అందుతున్న ఏర్పాట్ల గురించి సంబంధిత నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధ పిల్లలను పెంచి పోషించడానికి నీ సౌకర్యాలు కల్పిస్తామని, అనాధ ఆశ్రమంలో చేరే పిల్లలకు వారు అనాధలం అన్న ఆలోచన వారి మనసులో రాకుండా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది వారికి ప్రేమానురాగాలు చూపించాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎక్కడైనా రోడ్లమీద తిరుగుతున్న అనాధ పిల్లలను, రైల్వే స్టేషన్లో కానీ బస్టాండ్ లో కానీ, నిర్మానుషమైన ప్రదేశాలలో కానీ అనాధ శిశువులు ఉన్నట్లు సమాచారం అందితే సంబంధిత అధికారులు తప్పనిసరిగా అనాధ పిల్లల ఆశ్రమంలో చేర్పించాలని అన్నారు. అనాధాశ్రమంలో చేర్పించినంతమాత్రాన వారి బాధ్యత తీరలేదని వారికి ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుతున్నది లేనిది అప్పుడప్పుడు సంబంధిత అధికారులు గమనిస్తూ ఉండాలని అన్నారు. అనంతరం పిల్లలతో సరదాగా మాటా మంచి మాట్లాడి అనాధలం అనే భావన మీ మనసులో రావద్దని మీకు కావలసింది ఇక్కడ సిబ్బందిని అడిగి తీసుకోవాలని శ్రద్ధగా చదువుకొని ప్రయోజకులు కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం డి సి పి ఓ హరికుమారి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.