జర్నలిస్టులు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడిన–సూర్యాపేట డిఎస్పి జి రవి
జర్నలిస్టుల సంక్షేమం కోసమే టీఎస్ జెఏ కృషి చేస్తుంది
రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
ఎం ఏ ఎం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ప్యాడ్లు పెన్నుల పంపిణీ కార్యక్రమం
జర్నలిస్టులు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని సూర్యాపేట డిఎస్పి జి రవి అన్నారు శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక సీతారాంపురం లో గల ఎంఏ పాఠశాలలో 9వ తరగతి 10 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు 100 మందికి ఉచితంగా ప్యాడ్లు,పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎలాంటి వేతనాలు లేనప్పటికీ ప్రభుత్వ ప్రజాసేవ ఉచితంగా చేస్తున్న జర్నలిస్టులు సమాజానికి ఆదర్శంగా నిలబడతారని తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యార్థులకు ప్యాడులు పెన్నులు పంపిణీ చేసిన అసోసియేషన్ కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఇంకా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తాము చదువుకున్న కాలంలో ఎంతో పేద స్థితిలో ఉండి కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చామని ప్రస్తుతం ఇంత మంచి సౌకర్యాలతో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. త్వరలో జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో 10/10 మార్కులు సాధించిన విద్యార్థులకు మంచి బహుమతి ఇస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి ముందు టీఎస్ జే ఏ నాయకులు డి.ఎస్.పి ని బొకేతో ఆహ్వానించి శాలువాతో సన్మానించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమానికి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. అందులో భాగంగానే పేద విద్యార్థులకు 100 మందికి ఉచితంగా ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన డిఎస్పి రవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసమే తమ అసోసియేషన్ పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాకయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అదేవిధంగా అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగంపల్లి నాగబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ ఉద్దీన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలుకల చిరంజీవి సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రవి సూర్యాపేట నియోజకవర్గ నాయకులు దేశ గాని వెంకట్ గౌడ్ తాప్సి అనిల్ పడి శాల నాగయ్య యాతాకుల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు