జాతీయస్థాయి క్రీడలలో ఉద్యోగులు ఎంపిక కావడం ఆనందదాయకం 

జాతీయస్థాయి క్రీడలలో ఉద్యోగులు ఎంపిక కావడం ఆనందదాయకం 

— జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

 

 

 

క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ శాఖల ఉద్యోగులను కొనియాడారు.

 

బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన విద్యా, వ్యవసాయం, పంచాయతీ విభాగాల ఉద్యోగులను శాలువాలతో కలెక్టర్ సత్కరించారు 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ (AICS)ఉద్యోగుల క్రీడా పోటీలలో భాగంగా ఈనెల 24 మరియు 25 తేదీలలో హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో మన జిల్లా తరఫున 20 మంది క్రీడాకారులు వివిధ క్రీడా పోటీలలో పాల్గొనడం జరిగిందని అందులో నలుగురు వివిధ శాఖల్లో పని చేస్తూ పోటీల్లో పాల్గొని క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపికయ్యారు అన్నారు .ప్రతి ఏటా ప్రభుత్వం ఉద్యోగులకు క్రీడలు నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి క్రీడాకారులను

పంపడం జరుగుతుందన్నారు.

వీరందరూ కూడా ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు.

ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే విధినిర్వహణలో చురుకుగా పనిచేస్తారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ఉద్యోగుల ఎంపిక పట్ల ఆయా శాఖ అధికారులను అభినందించారు.

అనంతరం జాతీయస్థాయికి ఎంపికైన క్రీడాకారులను శాలువాలతో సన్మానించారు

 

1. సతీష్ – మండల పంచాయతీ అధికారి(MPO) తూప్రాన్- క్యారమ్స్ 

2. రాజశేఖర్ గౌడ్ -అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (AEO) – 400 మీటర్ల పరుగు.

 

3. శ్వేతా కుమారి పి.డి. _ విద్యాశాఖ -హాకీ క్రీడ

 

4. శారద పి.డి _ విద్యాశాఖ-హాకీ క్రీడ

 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎం.నగేష్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి నాగరాజు, జిల్లా అగ్రికల్చరల్ అధికారి వినయ్ కుమార్ లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment